Wednesday, November 17, 2010

నాకొక బ్లాగ్ కావాలెరా...

హే..నేనోక బ్లాగ్ ఒనర్ ని అయ్యానోచ్...ఒక ఫేండ్ ఇచ్హిన స్ఫూర్తి తో..అసలంటు మొదలు పెట్టా కానీ నాకైతె నమ్మకం లెదు...ఎమైనా రాస్తానో లేదో...
నాకు రాసే అలవాటుంది..కాని ఏమో లోలోన దాగి ఉన్న భావాలని అనిపించినప్పుడల్లా రాసూకోడం నా వరకు...ఎఫ్ఫుడైనా చదువుకోడం అంతే...ఇఫ్ఫుడిలా బ్లాగ్ రూపంలో పెడుతున్నా..చుద్దాం మది లోపలి లావా ఉప్పోంగి వస్తుందో రాదో...ఏమో..

ఇంటా బయటా ఎన్నో చూస్తూ.. ఎవేవో అనిపించినప్పుడల్లా రాయడం ఐతె చెస్తా..అదే ఇందులో పెట్టబోతున్నా ...

Tuesday, November 16, 2010

చెప్పాలని ఉంది ....



నీతో ....
ఓంటరిగా  మాట్లాడాలని  ఉంది...
సముద్రం ఒడ్డుపై కూర్చుని ...మట్టి మీద వెలితో రాస్తూ...ఊసులు చెప్పుకొవాలనుంది ...
నీ చేయి పట్టుకుని ...నువు చెప్పే కబుర్లు వింటూ...చాలా...దూరం...అలా నడవాలనుంది ...
మనసు గూటిలొ దాగి ఉన్న మాటలన్ని చెప్పేసుకుని...నువు చెప్పిన ఊసులన్నీ ...మళ్ళా  అదే మనసులోకి...దాచేసుకొవాలనుంది....
చిటికలో ...జారిపొయే ఆ క్షణాలన్ని...పొదివి పట్టుకొవాలనుంది...
మధుర జ్ఞ్యాపకాలుగా ...మారకముందె....